దుల్హ‌న్ లేదు... రంజాన్ తోఫాలు లేవు... ఇపుడ‌న్నీ ధోకాలే!

శనివారం, 1 జనవరి 2022 (20:37 IST)
నాడు మీ హ‌యాంలో మైనారిటీల‌కు రంజాత‌న్ తోఫాలుండేవి... ఇపుడు అన్నీ థోకాలే అని ఏపీ మైనారిటీ నేత‌లు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 
 
 
రాష్ట్ర మైనారిటీ నాయకుడు మహమ్మద్ ఫైజాన్ ఆధ్వ‌ర్యంలో ఆహ్వాన కమిటీ సభ్యులు హుస్సేన్ బాషా, ఎండీ స‌ల్మాన్, హజ్ కమిటీ మెంబర్ రెహ్మాన్, ఎస్కే కరిముల్లా, మొహమ్మద్ అఫ్సర్, మహమ్మద్ ఇస్మాయిల్, ఇంతియాజ్ అడ్డు, లాల్ వజీర్ ఉండ‌వ‌ల్లిలో నారా చంద్రబాబు నాయుడును ఆయ‌న స్వ‌గృహం క‌లిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి, ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న అరాచకాలను ఆయ‌న‌కు వివ‌రించారు. 
 
 
వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా, ముస్లిం మైనార్టీలకు ఏ పథకాలు అమలు కావ‌డం లేద‌ని ఆరోపించారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ముఖ్యమంత్రి దులహన్ పథకం, మైనారిటీ కార్పొరేషన్ తరఫున ఇచ్చే రుణాలు గాని ఏవీ అంద‌డం లేద‌ని పేర్కొన్నారు. మైనారిటీల‌కు విదేశీ విద్య ప‌థ‌కంగాని, రంజాన్ తోఫా గాని లేద‌ని కేవ‌లం, మైనారిటీల‌ను మ‌భ్య‌పెట్టే కార్య‌క్ర‌మాన్ని మాత్రం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అమ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.


వ‌క్ఫ్ బోర్డ్ ఆస్తులు కాపాడటంలో వైసీపీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌లం అయింద‌ని, ముస్లిం మైనారిటీలకు ద్రోహం చేస్తున్నార‌ని రాష్ట్ర మైనారిటీ నాయకుడు మహమ్మద్ ఫైజాన్ చంద్రబాబుకు వివరించారు. ముస్లిం మైనారిటీలు ఎప్పుడూ త‌మ‌ వెంటే ఉంటామని మాట ఇచ్చి, వచ్చే ఎన్నికల నాటి కి 2024 కి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శ‌ప‌థం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు