ఏపీలో కొత్త టెన్త్ - ఇంటర్ టైం టేబుల్ షెడ్యూల్ వెల్లడి

శుక్రవారం, 18 మార్చి 2022 (21:48 IST)
జాతీయ స్థాయిలో నిర్వహించే, జేఈఈ ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీల్లో మార్పులు రావడంతో పలు రాష్ట్రాల్లో టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కొత్త టైం టేబుల్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ కూడా కొత్త టైం టేబుల్‌ను ప్రకటించింది. 
 
తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ బోర్డు, పాఠశాల విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
పదో తరగతి పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే, ఇంటర్ పరీక్షలకు కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించారు. మే 6 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా ఏర్పాటు చేయనున్నారు. 
 
కాగా, పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ప్రకటించిన కొత్త టైం టేబుల్ ప్రకారం ఈ నెల 27వ తేదీన తెలుగు, 28వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 29వ తేదీన ఇంగ్లీష్, మే 2వ తేదీన గణితం మే 4న సైన్స్ పేపర్ 1, మే 5న సైన్స్ పేపర్ 2, మే 6న సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు