అమరావతి సమస్య చిన్నదే.. దీనిపైనే బీజేపీ భవిష్యత్ : పయ్యావుల కేశవ్

శుక్రవారం, 17 జనవరి 2020 (15:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంశం చాలా చిన్నదని టీడీపీ సీనియర్ నేత, ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన కేంద్రం అమరావతి అంశంలో పెద్దన్నపాత్ర పోషించాలని కోరారు. 
 
రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రకటించగా, అప్పటి నుంచి రాజధాని ప్రాంతం అమరావతితో పాటు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెల్సిందే. 
 
ఈ పరిస్థితుల్లో అమరావతి అంశంపై పయ్యావుల కేశవ్ స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన, బీజేపీ కలయిక కీలక పరిణామంగా అభివర్ణించారు. ఆ రెండు పార్టీలు రాజధాని కోసం ఏం చేస్తాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అయితే, ఈ కొత్త పొత్తుల శక్తి భవిష్యత్తులో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. 
 
అమరావతి మార్పుపై కేంద్రానికి చెప్పి చేస్తున్నామని వైసీపీ ప్రభుత్వం అంటోంది. రాజధాని అంశంపై బీజేపీ భవిష్యత్తు అధారపడి ఉందన్నారు. రాజధానిపై ఎవరు పోరాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పైగా, కాశ్మీర్ కసమస్యకు పరిష్కారం చూపిన కేంద్రానికి అమరావతి చిన్న విషయమేనన్నారు. అయితే, రాజధాని తరలింపుకు కేంద్రం ఆమోదం తెలిపిందా?.. అన్న అనుమానం ఉందని పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు