అమ‌లాపురం, రాజ‌మండ్రి లోక్ స‌భ స్థానాల అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

మంగళవారం, 12 మార్చి 2019 (19:26 IST)
అమలాపురం, రాజమండ్రి లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థులను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ ప్రకటించారు. జ‌న‌సేన పార్టీ త‌రుపున పార్ల‌మెంటుకు పోటీ చేసే తొలి అభ్య‌ర్ధిగా అమలాపురం స్థానానికి శ్రీ డి.ఎం.ఆర్. శేఖర్ పేరును ప్ర‌క‌టించారు.  విజ‌య‌వాడ పార్టీ ఆఫీసులో శ్రీ శేఖ‌ర్‌తో పాటు అనేకమంది నేత‌లు పార్టీలో చేరారు. 
 
వీరంద‌రికి శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కండువాలు క‌ప్పి సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. జ‌న‌సేన పార్టీ నుంచి రెండో అభ్య‌ర్ధిగా రాజ‌మండ్రి స్థానానికి  డా. ఆకుల సత్యనారాయణ పేరును ప్ర‌క‌టించారు. 32 అసెంబ్లీ స్థానాలకు, మ‌రో 7 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్ర‌క‌టించ‌నున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు