పవన్ బస్సు యాత్రకు "వారాహి" సిద్ధం... నేడు కొండగట్టులో ప్రత్యేక పూజలు

గురువారం, 8 డిశెంబరు 2022 (09:54 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా తన బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన ఒక ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనానికి "వారాహి" అనే పేరు పెట్టారు. ఈ వాహనానికి గురువారం తెలంగాణాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించనున్నారు. 
 
కాగా, తన పర్యటన కోసం సిద్ధమైన 'వారాహి' వాహనాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫోటోలను పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ఈ బస్సుకు వారాహి అనే పేరు పెట్టినట్టు పవన్ వెల్లడించారు. ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధమైనట్టు ఆయన ట్వీట్ చేశారు.
 
కాగా, ఈ బస్సు ఆలివ్ రంగులో ఉంది. ఇది చూడటానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తుంది. ఎంతో దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్‌కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇందులో హైసెక్యూరిటీ వ్యవస్థతో పాటు జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డు చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్‌ ఇలా అన్ని రకాల సదుపాయాలను ఇందులో సమకూర్చుకున్నారు. పైగా, వాహనం ట్రయల్‌ను కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ వారాహికి గురువారం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు