ములుగు - దేవునిగుట్టలో పెద్దపులి సంచారం...

బుధవారం, 1 డిశెంబరు 2021 (09:07 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు మండలంలోని దేవునిగుట్టలో పెద్దపులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేయగా, వారు వచ్చి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. అపుడు పెద్దపులి అడుగులను వారు గుర్తించారు. దీంతో స్థానికులను అప్రమత్తం చేశారు. 
 
కొత్తగూడెం జిల్లా ములుగు మండలంలోని రాయినిగూడెం శివారు ప్రాంతాల్లోని దేవునిగుట్ట అటవీ ప్రాంతంలో ఈ పెద్దపులి సంచారాన్ని గుర్తించారు. నిజానికి గత కొన్ని రోజులుగా కొత్తగూడెం, మహబూబాబాద్, నర్సంపేట, పాకాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక పెద్దపులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
ఈ విషయాన్ని అధికారులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు పరిశీలించగా, పెద్దపులి సంచరినట్టుగా పాదాల ముద్రలను గుర్తించారు. దీంతో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు