జగన్‌ పదేపదే హోదాపై మాట్లాడటం సరికాదు: పురంధేశ్వరి

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (13:45 IST)
రెండు నెలల పాలనలో వైసీపీ ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోయిందని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ ఇసుకపై స్పష్టమైన విధానం ప్రకటించకపోవడంతో నిర్మాణరంగం కుదేలైందన్నారు. గోదావరి జలాలపై జగన్‌.. ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏపీకి హోదా ఇచ్చే అవకాశంలేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని స్పష్టం చేశారు. జగన్‌ పదేపదే హోదాపై మాట్లాడటం సరికాదన్నారు. విభజన చట్టంలోని అంశాలను 90శాతం కేంద్రం అమలు చేసిందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
 
అలాగే, కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి కూడా జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే కేసీఆర్‌కు ఏపీని జగన్‌ తాకట్టుపెడుతున్నారంటూ మండిపడ్డారు. ఏపీ విషయంలో జగన్‌ చారిత్రక తప్పిదం చేస్తున్నారని ఆరోపించారు. గోదావరి మిగులు జలాలపై.. కేసీఆర్‌ ప్రతిపాదనకు జగన్‌ అంగీకరించడం సరైంది కాదని హితవు పలికారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు