ఏపీకి వచ్చే ప్రయాణీకుల క్వారంటైన్ విధివిధానాలు

మంగళవారం, 14 జులై 2020 (09:29 IST)
కోవిడ్-19 వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికుల క్వారంటైన్ విషయంలో ఏపీ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదివరకు తక్కువ ప్రభావిత రాష్ట్రాలుగా ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఎక్కువ ప్రభావిత రాష్ట్రాల జాబితాలోకి చేర్చింది. 
 
ఈమేరకు హోమ్ క్వారంటైన్ కు సంబంధించిన కొత్త నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కోవిడ్-19 ఇన్ స్టెంట్ ఆర్డర్-64 ను విడుదల చేసింది. 
 
1. విమానాల్లో వచ్చే ప్రయాణీకులకు..

విదేశాల నుంచి వచ్చేవారు:
కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఖచ్చితంగా పాటించాలి. ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తున్నాము. 
 
తాజాగా వారికి కూడా 7 రోజుల పాటు  ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ విధానాన్ని అమలు చేయాలి. క్వారంటైన్ లో ఉండేవారికి 5లేదా 7వ రోజు  కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కోవిడ్ ఇన్ స్టెంట్ ఆర్డర్-52 ప్రకారం చర్యలు తీసుకుంటారు. 
 
దేశీయంగా విమాన ప్రయాణీకులకు:
దేశీయంగా విమానాల్లో ప్రయాణించేవారిలో ర్యాండమ్ గా 10శాతం మందికి కోవిడ్ టెస్ట్ లు చేస్తారు. టెస్ట్ ల కోసం 10శాతం మందికి సీటు నంబర్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 
అంతేకాకుండా 60ఏళ్లకు పైబడినవారు, 10ఏళ్లలోపు వారికి ఎయిర్ పోర్టులోనే స్వాబ్ టెస్ట్ తీసుకుంటారు. అనంతరం వారు 14 రోజులపాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. 
 
2. రైళ్లలో ప్రయాణించే వారు:
రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణికులలో 10శాతం మందికి కోవిడ్ పరీక్ష చెయ్యడం జరుగుతుంది. వీరికి రైల్వేస్టేషన్ బయటనే స్వాబ్ టెస్ట్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మిగతా ప్రయాణీకులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఉంచుతారు. ఒకవేళ పరీక్షలు చేసిన 10శాతం మందిలో పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్టయితే కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం వారికి చికిత్స ఉంటుంది. మిగిలిన ప్రయాణీకులందరూ 14 రోజులు స్వీయ నిర్బంధాన్ని తప్పనిసరిగా పాటించాలి.  
 
3. రోడ్డు మార్గంలో వచ్చేవారికి:
వివిధ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గము ద్వారా రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణికులలో ర్యాండమ్ గా 10 మందికి కోవిడ్ పరీక్ష చెయ్యడం జరుగుతుంది. వీరందరికి సరిహద్దుల్లోనే స్వాబ్ టెస్ట్ తీసుకుంటారు. వీరు తప్పనిసరిగా 14రోజులు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని సూచిస్తున్నారు.  
 
అంతేకాకుండా దేశీయంగా విమానాల్లో ప్రయాణించే వారితోపాటు రోడ్డు మార్గం ద్వారా రాష్ట్ర సరిహద్దుల్లో వచ్చే వారి కోసం స్పందన పోర్టల్ లో ఈపాస్ తీసుకోవాల్సి ఉంటుంది. 100% ఈ-పాస్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే అనుమతించడం జరుగుతుంది. 
 
ఒకవేళ ఈపాస్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేస్తున్నట్టయితే వారి పూర్తి వివరాలను తప్పనిసరిగా స్పందన పోర్టల్ లో నమోదు చేయాలి. 
 
రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు/ విమానాశ్రయాలు/ రైల్వే స్టేషన్ల ద్వారా ప్రయాణించే వారి సమాచారాన్ని మాతా శిశుసంక్షేమం పోర్టల్ తో అనుసంధానించడం జరుగుతుంది. 
 
ఇది స్థానిక వార్డు సెక్రటేరియట్, గ్రామ సచివాలయం, స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోని మెడికల్ ఆఫీసర్ ద్వారా ఆ ప్రయాణీకులు హోమ్ క్వారంటైన్లో ఉండేలా పర్యవేక్షిస్తారు. కోవిడ్ పరీక్షల్లో ప్రయాణీకులకు పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టయితే మెడికల్ ఆఫీసర్ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత వ్యక్తిని కోవిడ్ హాస్పటల్స్ మరియు కోవిడ్ కేర్ సెంటర్లకు తరిలిస్తారు. 
 
ఆశావర్కర్/ వార్డు వాలంటీర్ లు క్వారంటైన్ లో ఉన్న వ్యక్తుల ఇంటిని ప్రతిరోజూ సందర్శించి వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయం యాప్ లో రికార్డు చేస్తారు. 
 
అంతేకాకుండా స్థానిక ఎఎన్ఎం వారికి ఒకసారి హోమ్ క్వారంటైన్లో ఉన్న వ్యక్తిని పరామర్శించి గ్రామ, వార్డు సచివాలయం యాప్ లో రికార్డు చేస్తారు.
 
తదుపరి ఇవి కూడా పాటించాలి:
1. పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తితో ప్రాథమికంగా కాంటాక్ట్ అయిన వ్యక్తులు హోమ్ క్వారంటైన్లో ఉండేందుకు అవకాశం లేనివారికి మాత్రమే క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు అనుమతించాలి. 
 
2. ప్రాథమికంగా పాజిటివ్ వచ్చిన వక్తితో కాంటాక్ట్ అయిన వారు హోమ్ క్వారంటైన్ లో ఉండేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని స్థానిక మెడికల్ నిర్ధారించిన తర్వాతే 14 రోజుల హోమ్ క్వారంటైన్ కు అనుమతి ఇస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు