చంద్రబాబు వల్లే ప్రాణాలతో జీవించివున్నా : రఘురామకృష్ణంరాజు

ఠాగూర్

శనివారం, 6 ఏప్రియల్ 2024 (10:40 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుుడు వల్లే తాను ప్రాణాలతో జీవించివున్నానని తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామకృష్ణం రాజు అన్నారు. గతంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినపుడు తనను కాపాడింది చంద్రబాబేనన్నారు. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా న్యాయవాదులతో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారన్నారు. తొందరపడొద్దమన్నా.. ఏణీ కాదు.. నేను ఉన్నాను అని నా భార్యకు, నా కుమార్తె, నా కుమరుడికి ధైర్యం చెప్పారని గుర్తు చేశారు. నరసాపురం వైకాపా రెబల్ సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్రవారం పాలకొల్లులో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రజాగళం సభా వేదికపై రఘురామకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పారు. రఘురామను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీలో చేరిన అనంతరం రఘురామ ప్రసంగించారు.
 
'టీడీపీ అభిమానులకు, జనసేన అభిమానులకు, బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు. గతంలో నా ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబే. ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా, న్యాయవాదులతో మాట్లాడడమే కాకుండా, నా కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారు. తొందరపడొద్దమ్మా... ఏమీ కాదు, నేను ఉన్నాను అని నా భార్యకు, నా కుమార్తెకు, నా కొడుకుకు ధైర్యం చెప్పారు. ఉన్నాను, విన్నాను అని కొందరు సొల్లు కబుర్లు చెబుతారు... చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదు. నిజంగా ఆయన నాకు ఉన్నారు, నిజంగా ఆయన నా ఆక్రోశం విన్నారు. నా బాధ విన్నారు కాబట్టే... ఆయన ఇవాళ చెప్పినట్టు నేను మీ ముందు బతికున్నా. అందుకే చంద్రబాబుకు నేనెంతో రుణపడి ఉన్నాను.
 
కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇపుడు చంద్రబాబు చొరవతో మళ్లీ మీ ముందుకు వచ్చాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. అతి త్వరలోనే జూన్ 4వ తేదీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ ప్రభంజనం సృష్టించబోతున్నారు. ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని నేను సంవత్సరంగా చెబుతూనే ఉన్నాను. ఇందులో మోడీ బ్రహ్మ అయితే, విష్ణుమూర్తి చంద్రబాబు, పవన్ కల్యాణ్ పరమశివుడు. మనమందరం సైనికులం... జై టీడీపీ, జై చంద్రబాబు, జై పవన్ కల్యాణ్, జై నరేంద్ర మోడీ' అంటూ రఘురామ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. 
 
ఏపీ ఓప్పుల అప్పారావు ఉన్నారు.. ఆయనెవరో తెలుసా: కళా వెంకట్రావు 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ అప్పుల అప్పారావు ఉన్నారని, ప్రతి మంగళవారం అప్పు చేయకుంటే ఆయనకు నిద్రపట్టదని టీడీపీ సీనియర్ నేత, చీపురుపల్లి నియోజకవర్గ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 
 
ఏపీలో అప్పుల అప్పారావు జగన్‌ అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లిలో తెదేపా జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను ఒప్పించి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేస్తే అత్యధిక మెజార్టీతో గెలుస్తామన్న అభిప్రాయాన్ని పలువురు నాయకులు వ్యక్తం చేశారు. 
 
జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి విసినిగిరి శ్రీనివాసరావు, నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు రౌతు కామునాయుడు, సారేపాక సురేష్‌కుమార్‌, తాడ్డి సన్యాసినాయుడు, చనమల మహేశ్వరరావు, మాజీ ఎంపీపీలు పైల బలరాం, వెన్నె సన్యాసినాయుడు, రెస్కో మాజీ ఛైర్మన్‌ దన్నాన రామచంద్రుడు, నాయకులు కోట్ల సుగుణాకరరావు, బలగం వెంకటరావు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు