ఆ వీడియోలో "నా నాన్న పేరు మండిగ చిట్టబ్బాయి. తూర్పుగోదావరి జిల్లా మోతుగూడెంలో ఆరోగ్య శాఖలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. 1992లో నాకు 13 ఏళ్ల వయసులో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మా నాన్న మృతిచెందారు. మీరు ఈ వీడియో చూసే సమయానికి నేను బతికి ఉంటాననో లేదో తెలీదు. నా పరిస్థితికి సూత్రధారి రాఘవ కాగా.. అతడికి నా అక్క మాధవి, తల్లి సూర్యవతి సహకరించారు. మా అక్కతో వనమా రాఘవకు 20 ఏళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. వారికి నా తల్లి సహకరిస్తూ వచ్చింది. ఈ ముగ్గురూ కలిసి తండ్రి ద్వారా న్యాయబద్ధంగా నాకు రావాల్సిన ఆస్తిని అడ్డుకున్నారు" అని రామకృష్ణ తెలిపాడు.
అక్క మాధవికి పోలవరంలో రెండెకరాలు, రాజమండ్రిలో రెండు ఇళ్ల స్థలాలు, గోకవరంలో 200 గజాల స్థలం, అమ్మ రిటైర్‌మెంట్ డబ్బులో కూడా వాటా ఇచ్చామని చెప్పినట్లు వుందని రామకృష్ణ వీడియోలో తెలిపారు.