మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పలుచోట్ల రెండు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతుల రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ, వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆర్జీటీఎస్ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 44 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలు పగటిపూట అత్యవసరమైతేనే బయటకు రావాలని లేనిపక్షంలో గృహాలకే పరిమితం కావాలని కోరింది.
మరోవైపు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపూరు జిల్లాల్లో ఎండలు అదరగొడతాయని ఆర్జీటీఎస్ హెచ్చరించింది. ఇదిలావుంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి కారణంగా వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.