సొంత పార్టీ నాయకులపైనే రోజా ఫిర్యాదు.. ఎందుకంటే..?

శుక్రవారం, 31 డిశెంబరు 2021 (22:31 IST)
సొంత పార్టీ నాయకులు రోజాపై, రోజా సొంత పార్టీ నేతలపై ఫిర్యాదు చేసుకోవడం మామూలే కదా ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా.. ఇక్కడే అసలు ట్విస్ట్. టిడిపి నుంచి కొంతమంది కోవర్టులు వైసిపికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా చిత్తూరు ఎస్పీకే ఫిర్యాదు చేశారు.

 
అసలు రోజా ఏమన్నారంటే టిడిపిని బలోపేతం చేసే పనిలో భాగంగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ చిత్తూరుజిల్లా మంత్రులపైన, తనపైనా సోషల్ మీడియా వేదికగా అసత్యపు ప్రచారం చేసే వారిపై చర్యలు చేపట్టాలని ఎస్పీని రోజా కోరారు. అక్కచెల్లెల్లకు స్వంత ఇల్లు కట్టించి వారికి ఆస్థి హక్కు కల్పించేందుకు జగనన్న ప్రత్యేక శ్రద్థ చూపుతుంటే దాన్ని ఆపేందుకు టిడిపి నాయకులు కోర్టులో కేసు వేయడం సరికాదన్నారు.

 
పేదలకు సరఫరా చేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోను, తన ఫోటోను మార్ఫింగ్‌లు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు రోజా. వైసిపిలో ఉంటూ టిడిపికి సపోర్ట్ చేసే వారు ఎక్కువవుతున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు