కోవిడ్ మహమ్మారి కారణంగా భారీ సంఖ్యలో మృతులు పెరిగిపోతున్నాయి. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ వ్యాధిగ్రస్థులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో తిరుపతిలోని ఎస్‌వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలచివేస్తోంది.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తిరుపతి రుయాలో మరణ మృదంగం మోగిందని ఓ ట్విటరాటీ ఆరోపించారు. తనకు కన్నీళ్ళు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంత బాధ్యతారహితంగా ఎలా వ్యవహరించగలుగుతోందని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని సమర్థించేవారిపై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఆంధ్ర ప్రదేశ్ నిజంగా విపత్తులో ఉందని మరో ట్విటరాటీ అన్నారు.