ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా తగ్గుముఖం పట్టిందనుకొనేలోపే బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా కరోనా బారిన పడినవారిలో సైతం ఫంగస్ ఆనవాళ్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి 40 కేసులను రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాకపోయినప్పటికీ సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాంతకమే అవుతుంది.