రిషికొండలో కట్టడాల నిర్మాణాలపై సుప్రీం కోర్టు ఏపీకి షాకిచ్చింది. రిషికొండ పరిధిలో ఉన్న రిసార్ట్‌ను పూర్తిగా కూల్చేసిన ఏపీ ప్రభుత్వం అక్కడే దానిని మరింతగా విస్తరిస్తూ కొత్త రిసార్ట్‌ను కడుతున్న సంగతి తెలిసిందే. ఈ పనుల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించగా... పనులు నిలిపివేయాలంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.