ఏపీలో తిరుపతి ఉపఎన్నిక సందడి మొదలైంది. నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. గెలుపుపై పార్టీల వ్యూహాలు పదునెక్కుతున్నాయి. అయితే పంచాయతీ, పురపోరు తర్వాత టీడీపీకి ఒక విషయంలో టెన్షన్ పట్టుకుందట. ప్రభుత్వం చేతిలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికలను తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్టు టీడీపీ నమ్ముతోంది.
50 కుటుంబాలకు ఒక టీడీపీ కార్యకర్త!
రాష్ట్రంలో ప్రతి 50 కుటుంబాలు కవర్ అయ్యేలా వాలంటీర్ల వ్యవస్థ ఉంది. ప్రభుత్వ పథకాల నుంచి అన్ని వ్యవహారాలు వారే చక్కబెడుతున్నారు. గ్రామస్థాయిలో మంచి పట్టు సాధించారు. పథకాల లబ్ధిదారులు, ఇతర వర్గాలు అధికార పార్టీకి ఓటేసేలా ఈ వ్యవస్థ గట్టిగా పనిచేస్తున్నట్టు టీడీపీ నమ్ముతోంది.