కాగా, ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా వైకాపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిజానికి ఈయన ఆగస్టు 16వ తేదీనే వైకాపాలో చేరాల్సివుంది.
కానీ, ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు.. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌లు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో గంటా అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైకాపాలో చేరనుండటం గమనార్హం.