ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : 34 మంది అభ్యర్థుల పేర్లతో టీడీపీ రెండో జాబితా!!

ఠాగూర్

గురువారం, 14 మార్చి 2024 (14:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్థుల పేర్లతో తన రెండో జాబితాను గురువారం విడుదల చేసింది. ఇటీవల 94 మంది అభ్యర్థుల పేర్లతో ఆ పార్టీ తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ రెండో జాబితాలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. అలాలగే, రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్ చౌదరి, చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి పల్లా రామచంద్రారెడ్డికి అవకాశం కల్పించారు. అధికార వైకాపాకు కంచుకోటగా ఉన్న కందుకూరు బరిలో ఇంటూరు నాగేశ్వర రావును బరిలోకి దించారు. 
 
అలాగే, గురజాల నుంచి యరపతినేని శ్రీనివాస రావు బరిలోకి దిగుతుండగా, వైకాపా నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు నియోజకవర్గం కేటాయించారు. కాగా, ఈ రెండో జాబితాలో మొత్తం 34 మంది పేర్లు ప్రకటించగా, అందులో 27 మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. వీరిలో పదో తరగతి అంతకంటే తక్కువ చదివినవాళ్లు ఐదుగురు ఉన్నారు. ఒకరు పీహెచ్‌డీ, 11 మంది పీజీ, 9 మంది గ్రాడ్యుయేషన్, 8 మంది ఇంటర్ చదివిన వారు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు