మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన యడవిల్లి రామకృష్ణప్రసాద్, రాజోలుకు చెందిన బడుగు సాయిబాబా, తాడేపల్లిగూడేనికి చెందిన మోదుగుల బాలనాగేశ్వరరావు, ఉండ్రాజవరానికి చెందిన టి.రవి, కాకినాడ సాంబమూర్తినగర్‌కు చెందిన పెన్మెత్స వి కృష్ణ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
కృష్ణా - గుంటూరు జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి 24 నామినేషన్లు దాఖలయ్యాయి. కృష్ణా - గుంటూరు జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన మంగళవారం 11 మంది అభ్యర్థులు తమ అనుచరులతో ర్యాలీగా గుంటూరు కలెక్టరేట్ వద్దకు వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
కొందరు అభ్యర్థులు ముందుజాగ్రత్తగా రెండు, మూడు సెట్లు వేయడంతో మొత్తం నామినేషన్లు దాఖలైనట్లు అయింది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన దృష్ట్యా ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం బుధవారం గుంటూరు కలెక్టరేట్‌లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.