శ్రీవారి భక్తుల్లో భయాన్ని పోగొడుతున్నాం, ధైర్యాన్ని నింపుతాం, ఎవరు?

శుక్రవారం, 10 జులై 2020 (19:40 IST)
తిరుమలలోను కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులలో భయాన్ని పోగొట్టి ధైర్యం నింపే పనిలో పడింది రాష్ట్రప్రభుత్వం. స్వయంగా దేవదాయశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు తిరుమలలోని పలు ముఖ్యమైన ప్రాంతాలను పరిశీలించారు. భక్తులు ఏవిధంగా స్వామివారిని దర్సించుకుంటున్నారో ఆయన టిటిడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
 
టిటిడి చేసిన ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. కరోనా సమయంలో వచ్చిన భక్తలుందరికీ స్వామవారిని మనస్ఫూర్తిగా దర్సించుకునే అవకాశం లభిస్తోంది. దేశంలో ఏ దేవాలయం చేయలేని విధంగా టిటిడి దర్సన విధానం ఏర్పాటు చేసిందన్నారు.
 
వచ్చే ముందు తాను కూడా భయపడ్డానని, వచ్చిన తరువాత టిటిడి చేసిన ఏర్పాట్లు చూసి మూడు రోజులైనా ఉండాలని ఉందన్నారు. కరోనా భయం పోగొట్టే విధంగా టిటిడి భక్తులకు మనోదైర్యాన్ని నింపుతోందన్నారు. 
 
ముఖ్యమంత్రి సూచనల ప్రకారం టిటిడి ఏర్పాట్లు అభినందనీయమని..కంటోన్మెంట్ జోన్లలో ఉండే దేవాలయాల్లో మినహా మిగిలిన అన్ని ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నామన్నారు. ఇతర మతాల పుస్తకాలు సప్తగిరి పుస్తకాలతో పెట్టాల్సిన అవసరం టిటిడికి ఎందుకు ఉందన్నారు. 
 
టిడిపి, పచ్చ మీడియా రాజకీయ కుట్రలో భాగంగా టిటిడిపై విమర్సలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. సోషియల్  మీడియాలో ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని.. దేవాయల ఆస్తులు, హిందుల మనోభావాలు దెబ్బతీయకుండా నడుచుకోవాలని సిఎం జగన్ సూచించినట్లు మంత్రి వెల్లంపల్లి సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు