తాత్కాలిక బాంబు షెల్టర్లను ప్రకటించిన భారత్ హైకమిషన్

గురువారం, 24 ఫిబ్రవరి 2022 (22:09 IST)
ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రష్యా జరుపుతున్న బాంబు దాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా తాత్కాలిక బాంబు షెల్టర్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ బాంబు షెల్టర్లలలో భారతీయ విద్యార్థులతో పాటు.. భారతీయ పౌరులు తలదాచుకోవాలని సూచించింది. ఉక్రెయిన్‌లో పరిస్థితి భయానకంగా ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. 
 
"ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లో ఉండటానికి స్థలం లేకుండా చిక్కుకుపోయిన విద్యార్థుల కోసం, వాటిని ఉంచడానికి మిషన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది" అని భారత హైకమిషన్ ప్రతినిధులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు