తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన వీహెచ్.. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ అగ్రకులాల పెత్తనమే సాగుతుందని విమర్శలు గుప్పించారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.