ఖమ్మంజిల్లా ఎర్రుబాలెం మండలం కొత్తపాలెం గ్రామంలో మోహనరంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన రాధాకృష్ణ అనంతరం తమ సామాజిక వర్గం వారితో మాట్టాడారు. నా తండ్రి రంగాను అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు... తరాలు మారినా, యుగాలు మారినా ధరిత్రి ఉన్నంత వరకు రంగా ఉంటారని వంగవీటి రాధా చెప్పారు. రంగా కాపులకు ఆరాధ్యదైవమైతే... అన్ని వర్గాల పేదల గుండె చప్పుడని, మన నాయకుడు రంగాని మనం కాపాడుకోలేక పోయాం... ఇప్పుడు అయినా ఆవేశం తగ్గించి, ఆలోచనతో... ఉన్న నాయకులను అయినా కాపాడుకోమని కోరుతున్నా అని రాధా చెప్పారు.
నేడు పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి అడ్డమైనోడికి ఫ్యాషన్ అయిపోయింది... వాళ్లేదో గొప్పగా భావిస్తూ... పుట్టిన కులాన్ని వెటకారం చేస్తున్నారు. ఈ కులం వారంతా ఐక్యంగా ఉంటే, ప్రభుత్వాలనే పడగొట్టే సత్తా ఉంది. ఐకమత్యమే బలం.. ఉన్నవారిని అయినా కాపాడుకోండి అంటూ రాధా చెప్పారు.