ప్రపంచంలో భవిష్యత్తులో ఎలక్ట్రీక్ వాహనాలదే పైచేయి అని, బ్యాటరీ వాహనాల రంగం అభివృద్ధి చెందుతుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలో ఎలక్ట్రికల్ వెహికల్ షోరూం ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గాంధీనగర్ లో నేడు జాంగిడ్ మోటార్స్-ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంను ప్రారంభించారు.
కాలుష్య రహితమైన ఎలెక్ట్రికల్ వెహికల్ వాడటం వలన ప్రకృతిని కాపాడటం జరుగుతుందని అన్నారు , భవిష్యత్తులో ఎలెక్ట్రికల్ వాహనరంగం అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. బాలి గోవింద్, ఉద్దంటి సునీత సురేష్,పి.కృష్ణ, గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ, తోలేటి శ్రీకాంత్,పెంటి నాగరాజు, చేవూరి రామస్వామి, తాటికొండ రంగబాబు, చిప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు.
జాంగిడ్ మోటార్స్ అధీకృత డీలర్ బ్రహ్మాస్ ఈ మోటార్స్ యజమాన్యంను అందరూ అభినందించారు. పి.బ్రహ్మేశ్వరరావు, కొండముది బంగారు బాబు, సిద్ధార్థ శ్రీపల్లి, సిబ్బంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.