'ఛలో సీఎంవో'కు అనుమతి లేదు... ఎవరూ రావొద్దు : సీపీ టాటా

ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (15:54 IST)
సీపీఎస్ రద్దుపై గతంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న డిమాండ్‌తో యూటీఎఫ్‌ సోమవారం చేపట్టదలచిన ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, "ఛలో సీఎంవో" కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పారు. అందువల్ల అనుమతి లేని కార్యక్రమంలో ఉద్యోగులు ఎవ్వరూ పాల్గొనరాదని చెప్పారు. ఒకవేళ పాల్గొంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పైగా, విజయవాడలో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఉద్యోగి గమనించాలని ఆయన కోరారు. 
 
మరోవైపు, పోలీసులు, ప్రభుత్వం కలిసి అడ్డుకున్నప్పటికీ తాము నిర్వహించలదలచిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని యూటీఎఫ్ నాయకులు అంటున్నారు. మరోవైపు, ఛలో విజయవాడ కోసం వెళుతున్న యూటీఎఫ్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు