ఏపీలో ఓటర్ల ముసాయిదా జాబితాలో వింతలు.. భార్య పేరు 'డ'.. భర్త పేరు 'ట'

గురువారం, 9 నవంబరు 2023 (10:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది ఆరంభంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికలం సంఘం ఓటర్ల ముసాయిదాను తయారు చేసి విడుదల చేసింది. అయితే, ఈ ముసాయిదా జాబితాలో చిత్ర విచిత్రాలెన్నో కనిపిస్తున్నాయి. అధికార వైకాపా నేతలు ఈ ఓటర్ల జాబితా తయారీలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. ప్రతి గ్రామంలోనూ భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరులో అయితే మరింత దారుణంగా ఉంది.
 
ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం వెంకటదాసరిపల్లెల్ 230వ పోలింగ్ కేంద్రం పరిధిలోని ముసాయిదా ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. 211 సీరియల్ నంబరులోని ఓటరు పేరు "డ'' అని, ఆమె భర్త పేరు "ట" అని ముద్రించి ప్రచురించారు. ఈ సీరియల్ నంబరులో ముద్రించిన ఫోటోలో ఉన్న మహిళ పేరు ఇందిరమ్మ. భర్త పేరు చిన్న వెంకటరమణ. ఆమెది ఇదే పంచాయతీలోని జూపల్లెవారిపల్లె స్వస్థలం. స్థానిక సర్పంచి, వైకాపా మద్దతుదారులైన లక్ష్మీదేవి కుమారుడు హర్షవర్థన్‌కు రెండు ఓట్లు ఉండటం గమనార్హం. ఇదే పంచాయతీలోని 231వ పోలింగ్ కేంద్రంలో స్థానికేతరులకు 49 ఓట్లు ఉన్నాయి. ఇలాంటి అక్రమాలన్నీ స్థానిక పార్టీ నేతలు దగ్గరుండి చేయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు