మహిళలకు రక్షణ ఏది?... లోకేష్ ట్వీట్

సోమవారం, 28 అక్టోబరు 2019 (15:12 IST)
ఎన్నికల సమయంలో అమ్మా, అక్కా అంటో ఓట్లు దండుకుని ఇప్పుడు వారి భద్రతకు తిలోదాలిచ్చారంటూ జగన్ పై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు.

‘అనంతపురం జిల్లా ఈదులబలపురంలో ఒక మహిళ భర్తను బంధించి, మీ నాయకుడొకరు ఆమెపై అత్యాచారం చేయబోయిన ఘటన అత్యంత ఘోరం. ఈ అభాగ్యురాలు చేసిన పాపమేంటి? ఎన్నికలప్పుడు అమ్మా, అక్కా, చెల్లీ అని ఓట్లు అడిగారు కదా జగన్ గారూ. ఇప్పుడు వాళ్లకి భద్రత కరవయింది, దీనికేం సమాధానం చెబుతారు?’ అని ట్వీట్ చేశారు.

ఆ మహిళ మీడియాకు వివరాలు తెలిపిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోతో .. సోమందేపల్లి మండలం ఈదుల బలపురం గ్రామంలో వైసీపీ నాయకుడు ఒకరు తనను వేధిస్తున్నాడని ఓ వివాహిత ఆరోపణలు చేసింది. తన కోరిక తీర్చాలంటూ తనను  ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపింది.

తన భర్తను బంధించి తనపై అత్యాచారం చేయబోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వైసీపీ నేతను  అరెస్ట్ చేసి, శిక్షించాలని పేర్కొంది.  దీనిపై ప్రభుత్వం తరుపున ఎవరూ స్పందించడం లేదని లోకేష్ మండిపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు