ఈ సంఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇలా అందరూ కళ్యాణ్ పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. అయితే, మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రోజా కూడా పవన్ కల్యాణ్‌కు సానుభూతి తెలిపారు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పట్ల తనకు ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదని రోజా నిరూపించారు.
తిరుపతి గోశాల సమస్యకు సంబంధించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, రోజా పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన చిన్న కుమారుడుపై విమర్శలు గుప్పించారు. "కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో గొడవ పడితే ఏమి జరుగుతుందో చంద్రబాబుకు ముందే తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే దానిని చూశాడు." అంటూ పరోక్షంగా మార్క్ ఫైర్ యాక్సిడెంట్ విషయాన్ని గుర్తు చేసేలా రోజా మాట్లాడారు. ప్రస్తుతం రోజా కామెంట్లపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీకే, జనసేన అభిమానులు రోజాపై మండిపడుతున్నారు.