వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు.. నందిగం సురేశ్‌కు రిమాండ్

ఠాగూర్

గురువారం, 5 సెప్టెంబరు 2024 (19:19 IST)
విజయవాడ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసు విచారణ శరవేగంగా సాగుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న వైకాపా నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో వైకాపా నేతలను ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. గురువారం ఉదయం వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఆ తర్వాత మరో వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. ఆయనను బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. అప్పిరెడ్డిని కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించనున్నారు. 
 
కాగా, నందిగం సురేశ్‌ను స్థానిక కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. మరోవైపు, ఈ దాడి కేసులో సంబంధం ఉన్న వైకాపా నేతలు తలశిల రఘురాం, దేవినేని అవినాశ్‌లు పరారీలో ఉన్నారు. వీరి కోసం 12 పోలీసు బృందాలను ఏర్పాటు చేయగా, ఈ బృందాలు ఈ వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు