బైట యూట్యూబ్ ఛానల్ బోర్డ్, లోపల 10 మంది మహిళలతో స్పా మసాజ్ (video)

ఐవీఆర్

శనివారం, 22 ఫిబ్రవరి 2025 (14:34 IST)
డబ్బు సంపాదించేందుకు ఎన్ని అడ్డదారులు వుంటే అన్ని అడ్డదారులు వెతుక్కుంటూ వెళ్తూ అడ్డంగా బుక్కవుతున్నారు చాలామంది. చేయకూడదని తెలిసినా అలాంటి పనులే చేసేస్తున్నారు. తాజాగా విజయవాడ సిటీలో వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులోని ఓ యూ ట్యూబ్ ఛానల్ నిర్వహకుడు లోపల చేస్తున్న తతంగం చూసి మాచవరం పోలీసులు నివ్వెరపోయారు.
 
బైట బోర్డు చూస్తేనేమో యూట్యూబ్ ఛానల్ అని వుంది. లోపలికి వెళితేనేమో... 10 మంది మహిళలతో స్పా.. మసాజ్ చేస్తున్నారు. ఇది కాస్తా ఆనోటా ఈనోటా పోలీసులకు చేరింది. దీనితో పోలీసులు మెరుపుదాడి చేసారు. లోపల 10 మంది మహిళలు, 13 మంది విటులు పట్టుబడ్డారు. పట్టుబడిన మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
 
కాగా యూట్యూబ్ ఛానల్ ను స్పా సెంటరుగా మార్చేసి వ్యాపారం చేస్తున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహణ..

విజయవాడ వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్ లోని ఓ స్టూడియోపై పోలీసుల దాడి

10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహిళలంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తింపు

చలసాని ప్రసన్న భార్గవ్ యూట్యూబ్ ఛానల్ ను అడ్డం… pic.twitter.com/wIAm4jeyya

— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు