Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

సెల్వి

గురువారం, 27 మార్చి 2025 (22:10 IST)
Kodali Nani
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని బుధవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నాని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని కొన్ని ఊహాగానాలు వచ్చాయి. అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొడాలి నానితో వైఎస్ జగన్ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. 

తాజా మీడియా నివేదికల ప్రకారం, జగన్ కొడాలి నానికి ఫోన్ చేసి సంభాషినట్లు తెలుస్తోంది. తరువాత, నాని గుండె జబ్బుతో బాధపడుతున్నారని, కొడాలి నాని గుండెకు చెందిన మూడు కవాటాలు మూసుకుపోయాయని వైద్య బృందం జగన్‌కు తెలియజేసింది.
 
నాని ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇంకా ఆయన కోలుకునేందుకు మరింత సమయం కావాలి కాబట్టి.. టెలిఫోన్ సంభాషణ క్లుప్తంగా జరిగిందని టాక్ వస్తోంది. ముందుగా జగన్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి నాని, ఆయన కుటుంబ సభ్యులతో సంభాషిస్తారని ఊహించారు. కానీ జగన్ ఫోనులోనే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు