నా కుమారుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు : వైఎస్ షర్మిల

ఠాగూర్

శుక్రవారం, 12 సెప్టెంబరు 2025 (09:41 IST)
తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసుడు తన కుమారుడే అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో జరిగిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. "వైసీపీ సైతాన్ సైన్యం ఎంత గోల పెట్టినా, అరిచినా మారేది లేదు. నా కొడుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు. ఇది ఎవరూ మార్చలేరు" అని ఆమె స్పష్టం చేశారు. 
 
"నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టలేదు. అయినా వైసీపీ ఈ స్థాయిలో స్పందిస్తే... అది వాళ్ల భయమా? బెదురా? వాళ్లకే తెలుసు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా నా కొడుకుకు 'రాజారెడ్డి' అని నామకరణం చేశారు" అంటూ గు ర్తు చేశారు. తన కొడుకు రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ చేసిన వీడియో ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన షర్మిల.. "అంత కష్టపడాల్సిన అవసరమేంటి? అది చూసి నాకైతే నవ్వొచ్చింది" అని విమర్శించారు. అదే సమయంలో వైసీపీ నేతలు, చంద్రబాబు సహా తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
చంద్రబాబు చెప్తే నా కొడుకును రాజకీయాల్లోకి తీసుకువస్తే మరి ఎవరు చెబితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. “వైఎస్ఆర్ తన మొత్తం జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారు. ఆయన బతికుంటే జగన్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకునేవారు" అని షర్మిల అన్నారు. జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతివ్వలేదో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు