08-02-2024 గురువారం దినఫలాలు - రాఘవేంద్రస్వామిని పూజించిన పురోభివృద్ధి...

రామన్

గురువారం, 8 ఫిబ్రవరి 2024 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య ఐ॥ త్రయోదశి ఉ.9.35 ఉత్తరాషాఢ రా.1.49 ఉ.వ.10.30 ల 12.02. తె.వ.5.36 ల ఉ.దు. 10.20 ల 11.06 ప. దు. 2.51 ల 3.36.
రాఘవేంద్రస్వామిని పూజించిన పురోభివృద్ధి కానవస్తుంది.
 
మేషం :- ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు జాగ్రత్త  వహించండి. 
 
వృషభం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఫ్లీడర్లు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సంఘంలో గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. బ్యాంకు పాత రుణాలు తీర్చగలుగుతారు.
 
మిథునం :- వ్యాపారాలల్లో చికాకులు తప్పవు. పనులు ఎంతకీ పూర్తికాక విసుగు కలిగిస్తాయి. రవాణా విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రుణాల కోసం అనేషిస్తారు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి.
 
సింహం :- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుంది. ఫైనాన్సు, చిట్స్ వాయిదాలు, పన్నులు సకాలంలో చెల్లిస్తారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.
 
కన్య :- రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. కొంతమంది మీ దృష్టి మళ్ళించి మోసగించే ఆస్కారం ఉంది. స్త్రీల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. అవసరాలకు కావలసిన ధనం అందక ఇబ్బందులు ఎదుర్కుంటారు.
 
తుల :- ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు వాయిదా పడతాయి. ఉమ్మడివెంచర్లు, పెట్టుబడులు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. కరెన్సీ నోట్ల పరిశీలన, చెక్కులిచ్చే విషయంలో జాగ్రత్త అవసరం. స్త్రీలకు స్వీయ ఆర్జన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఎలక్ట్రికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.
 
వృశ్చికం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. కొబ్బరి, మామిడి, పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైన కాలం. ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక రూపేణా వస్తున్న అవరోధాలను మనోధైర్యంతో ఎదుర్కొంటారు. మీ అభిప్రాయాల వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది.
 
ధనస్సు :- ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారికి ఆందోళన అధికం. బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు పునరావృతమవుతాయి.
 
మకరం :- ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ధనం ఎంత వస్తున్నా ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. ఉద్యోగస్తుల శక్తి సామర్ధ్యాలను అధికారులు గుర్తిస్తారు. సన్నిహితుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు. ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభించాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో ఏకాగ్రత అవసరం. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు ఆటంకాలు తప్పవు. మీ ఆంతరంగిక సమస్యలకు పరిష్కార మార్గం కానరాగలదు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు ఊహించని సమస్యలు తలెత్తినా పరిష్కరించు కోగలుగుతారు.
 
మీనం :- బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. తలపెట్టిన పనిలో సఫలీకృతులు కాగలరు. దూరప్రాంతలకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు సంతృప్తి కానవస్తుంది. దంపతుల మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేధాలు తలెత్తవచ్చు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు