08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

రామన్

బుధవారం, 8 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ప్రముఖుల కలయిక వీలుపడదు. పనులు వాయిదా వేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. ప్రతికూలతలను అధిగమిస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. మీ ప్రమేయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనులు చురుకుగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. ప్రయాణంలో జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పొదుపు ధనం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆత్మీయులను సంప్రదిస్తారు. ఆపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆప్తులతో ఉల్లాసంగా గడపుతారు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ శ్రీమతి ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పత్రాలు అందుకుంటారు. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు సానుకూలమవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అనురాగవాత్యల్యాలు వెల్లివిరుస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అప్రమత్తంగా ఉండాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. సన్నిహితుల కలయికతో స్థిమితపడతారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. యత్నాలను ఆప్తులు ప్రోత్సాహిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పోగొట్టుకున్న పత్రలు లభ్యమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు బలపడతాయి. వాహనం, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలు అధికం. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అనవసర జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
నిర్విరామంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహార లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు