సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మొండిగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఖర్చులు సామాన్యం. పనులు సానుకూలమవుతాయి. బెట్టింగులకు పాల్పడవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
బంధువులతో మనస్పర్థలు, దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగి విషయాలు వెల్లడించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సభ్యత్వాలు, స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి.
వ్యవహారదక్షతతో రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన శ్రేయస్కరం. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. ఖర్చులు సామాన్యం. దూర ప్రయాణం తలపెడతారు.
సంకల్పం నెరవేరుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. ఖర్చులు అదుపులో ఉండవు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
పెద్దల వ్యాఖ్యలు మీపై సత్ ప్రభావం చూపుతాయి. కొత్త పనులు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య అకారణ కలహం. ఆత్మీయులతో సంభాషిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు భారమనిపించవు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.