20-01-2025 సోమవారం దినఫలితాలు- మీ బలహీనతలు అదుపులో ఉంచుకుంటే?

రామన్

సోమవారం, 20 జనవరి 2025 (05:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. పనులు చురుకుగా సాగుతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అవసరాలకు ధనం అందుతుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో మెలగండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. ఖర్చులు అధికం. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ప్రయాణం విరమించుకుంటారు.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
లావాదేవీలు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. నగదు, స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. అప్రమత్తంగా ఉండాలి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. మనోధైర్యంతో మెలగండి. కొంతమొత్తం ధనం అందుతుంది. అవసరాలు తీరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయులను కలుసుకుంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
మీ సమర్ధతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు. మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పంద లభిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యూహాత్మకంగా అడగులు వేస్తారు. పరిచయాలు బలపడతాయి. యత్నాలు, పనులు ప్రారంభిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ప్రతి విషయం స్వయంగా చూసుకోండి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. బంధువులతో సంభాషిస్తారు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. పనులు సానుకూలమవుతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. జూదాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు