28-10-2024 సోమవారం దినఫలితాలు - అత్యుత్సాహం ప్రదర్శించవద్దు...

రామన్

సోమవారం, 28 అక్టోబరు 2024 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. పనులు మందకొడిగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు, పత్రాల్లో మార్పులు సాధ్యపడవు. వేడుకకు హాజరవుతారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ సమస్య పరిష్కారమవుతుంది. తాకట్టు విడిపించుకుంటారు. ఖర్చులు అధికం. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. గృహనిర్మాణాలు ముగింపు దశకు చేరుకుంటాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. వ్యాపారాలు పుంజుకుంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆందోళన తగ్గి స్థిమితపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో ఆశించిన మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు. స్థిరాస్తుల వ్యవహారంలో మెలకువ వహించండి. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. కొందరిరాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు, పనులు సాగవు. చెల్లింపులు, పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. మాటతీరు ఆకట్టుకుంటుంది. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్యసఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, అకాలభోజనం. అనుకున్న ఖర్చులే ఉంటాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఉద్యోగస్తులకు శుభయోగం. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవకాశాలు కలిసివస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు విపరీతం. పత్రాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగపరంగా మంచి ఫలితాలుంటాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయాలి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో నిర్లక్ష్యం తగదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టా సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఆధ్మాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మీ నమ్మకం వమ్ముకాదు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సందేహాలు, అపోహలకు తావివ్వవద్దు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. దైవదీక్షలు స్వీకరిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు