ఎమ్. సురేష్-నిజామాబాద్ మీరు పూర్ణిమా సోమవారం, వృశ్చికలగ్నము, కృత్తికా నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు కుజ, గురు, రాహువులు ఉండటం వల్ల 2012 లేక 2013 నందు మీకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోండి.
ఆదిత్యుడిని మంకెన పూలతో పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 2016 వరకు సామాన్యమైన అభివృద్ధి ఉన్నా, తదుపరి గురు మహర్ధశ 16 సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధి నివ్వగలదు.