భూపతి శివనాగేశ్వరరావూ.. కార్తీకేయుడిని ఎర్రని పూలతో పూజించండి.

శనివారం, 30 జూన్ 2012 (16:38 IST)
FILE
భూపతి శివనాగేశ్వరరావు

మీరు పాడ్యమి సోమవారం తులాలగ్నము, చిత్తా నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు కుజుడు ఉండటం వల్ల సంతాన బలం తగ్గిందని చెప్పవచ్చు. సంతాన స్థానాధిపతి అయిన శని రాజ్యము నందు ఉండటం వల్ల, 2015 లోపు మీకు సంతానం కలిగి అవకాశం 50 శాతం ఉంది.

వైద్యుని సలహాతో ముందుకు సాగండి. శుభం కలుగుతుంది. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ఒత్తిడి, చికాకు, ఆందోళనలు వంటివి ఎదుర్కొన్నా 2013 నుంచి నెమ్మదిగా మార్పు కానవస్తుంది. కార్తికేయుడిని ఎర్రని పూలతో పూజించడం వల్ల పురోభివృద్ధి పొందుతారు. 2016 నుంచి శని మహర్ధశ 19 సంవత్సరాలు మంచి అభివృద్ధినిస్తుంది.

వెబ్దునియా పై చదవండి