మీ కుమారుడు అనుకున్న సంబంధం కాదు.. మీరు చూసిందే అవుతుంది
గురువారం, 5 జులై 2012 (17:30 IST)
WD
రుక్మిణి -మీ కుమారుడు విదియ శుక్రవారం, సింహలగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. లగ్నము నందు కేతువు ఉండి, భార్యస్థానము నందు రాహువు ఉండి, అష్టమ స్థానము నందు కుజుడు ఉండటం వల్ల మీ కుమారుడు ఒక సంబంధం అనుకుంటాడు. ఆ సంబంధం కాకుండా పెద్దలు కుదిర్చిన వివాహం అవుతుంది.
2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారంనాడు 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి మాసశివరాత్రి నాడు ఈశ్వరునికి అభిషేకం చేయించినా శుభం కలుగుతుంది. ఏదైనా దేవాలయంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ మారేడు చెట్టును నాటినా సర్వదాశుభం కలుగుతుంది