చేతి వేలికి రాగి ఉంగరాన్ని ధరిస్తే ఏమవుతుంది?

బుధవారం, 26 జులై 2023 (23:33 IST)
రాగి. రాగి పాత్రలతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నది తెలిసిందే. కొంతమంది రాగిని ఆభరణాలుగా చేసుకుని ధరిస్తుంటారు. రాగి ఆభరణాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాగి ఒక యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ మెటల్. ఇది చర్మానికి హాని కలిగించదు. రాగిని స్పిరిట్, మైండ్ బ్యాలెన్సింగ్ ఎలిమెంట్ అని కూడా అంటారు కాబట్టి కొంతకాలం పాటు రాగిని ధరించడం ఆరోగ్యకరం.
 
రాగి ఉంగరాన్ని ధరించడం ద్వారా శరీరంలోని అధిక వేడిని తగ్గించుకోవచ్చు. రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల కీళ్ల నొప్పులు, కడుపు వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు రాగి కంకణం ధరించాలి.
 
రాగి ఉంగరాన్ని ధరించడం వల్ల రక్తం శుభ్రంగా ఉంటుంది, రక్త ప్రసరణ కూడా చక్కగా ఉంటుంది.
రాగి ఉంగరం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. గుండె సమస్యలున్నవారు, పేస్‌మేకర్ ఉన్నవారు రాగి అయస్కాంత కంకణాలను ధరించకూడదు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు