చర్మానికి కీరదోస, కలబంద చేసే మేలు అంతా ఇంతా కాదు..

బుధవారం, 14 నవంబరు 2018 (18:02 IST)
కీరదోస, కలబందను వాడితే చర్మం ప్రత్యేక నిగారింపును సంతరించుకుంటుంది. డ్రై స్కిన్ సమస్య నివారించడంలో కలబంద నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ముఖానికి, చేతులకు అలోవెరా జెల్‌ను అప్లై చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా తయారవుతుంది. అలాగే కీరదోస కాయ కూడా చర్మానికి తేమనిస్తుంది.
 
కీరదోసకాయలో ఉండే నీరు పొడిబారిన చర్మానికి పోషణను అందిస్తుంది. దాంతో చర్మ సమస్యలు దూరమవుతాయి. ఇది చర్మంలోనికి చొచ్చుకొని పోయి, స్కిన్ సెల్స్‌కు అవసరం అయ్యే మాయిశ్చరైజర్‌ను అందిస్తాయి. మిక్సీలో కీరదోసకాయ ముక్కలు వేసి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా డ్రై స్కిన్‌కు చెక్ పెట్టవచ్చు.
 
కలబంద, కీరదోస లాగానే బొప్పాయిలో యాంటీయాక్సిడెంట్స్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని టాక్సిన్స్ నివారించి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. బొప్పాయిని పేస్ట్ చేసి ముఖానికి అప్లై చేయడం ద్వారా మెరిసే చర్మ ఛాయను పొందవచ్చునని బ్యూటీషన్లు సూచిస్తున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు