ఉల్లిపాయ రసంలో కొద్దిగా పెరుగు, పాలు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తొలగిపోయి ఒత్తుగా పెరుగుతుంది. అలానే ఈ ఉల్లిరసంలో వెల్లుల్లి రసం, యాపిల్ సైడర్ వెనిగర్, చక్కెర కలిపి తలకు రాయాలి. 2 గంటల పాటు అలానే ఉంచుకుని తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.