1. ఒక టీస్పూను తాజా నిమ్మరసం, ఒక టీస్పూను ఉప్పు, ఒక టీస్పూను కలబంద రసం కలిపి జుట్టుకు రాసుకోవాలి. అరగంట అయ్యాక చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలలో రెండుసార్లు ఈ ప్యాక్‌ను వేసుకుంటే జుట్టు మెరుస్తూ ఉంటుంది.
2. పావు కప్పు పెరుగుకి గుడ్డులోని తెల్లసొనను కలిపి తడిగా ఉన్న జుట్టుకి రాసి అరగంట పాటు వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేయడం వలన జుట్టులో తేమ నిండి మెత్తగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
4. అరటిపండ్లు, తేనె, పెరుగు, తక్కువ కొవ్వు ఉన్న పాలు కలిపి తయారుచేసిన డ్రింక్‌ను కొన్ని వారాల పాటు తాగడం వలన జుట్టు ఊడడం తగ్గిపోతుంది.