ఆన్‌ గ్రౌండ్‌ కార్యక్రమాల ద్వారా ట్రక్‌ ఫ్లీట్స్‌, డ్రైవర్లకు చేరుకున్న ‘గో ఎక్స్‌ట్రా’ ప్రచారం

బుధవారం, 3 మార్చి 2021 (23:05 IST)
టైర్‌ సాంకేతికత మరియు పరిష్కారాలలో అగ్రగామిగా ఉన్న బ్రిడ్జ్‌స్టోన్‌కు అనుబంధ సంస్థ, బ్రిడ్జ్‌స్టోన్‌ ఇండియా, మరియు సుప్రసిద్ధ వాణిజ్య వాహన మ్యాగజైన్‌ మోటర్‌ఇండియాలు ఇప్పుడు వినూత్నమైన కార్యక్రమం- ‘గో ఎక్స్‌ట్రా’ను ఆరంభించాయి. బ్రిడ్జ్‌స్టోన్‌ యొక్క నూతన ఎం721 టైర్‌‌ను ప్రదర్శించే ప్రధాన లక్ష్యంతో దీనిని ఆరంభించారు. అదనపు 15% మైలేజీ ఇచ్చే టైర్‌ను వాణిజ్య వాహన పరిశ్రమలోని వాటాదారులైనటువంటి ఫ్లీట్‌ నిర్వాహకులు, డ్రైవర్లు, మరియు మెకానిక్కులకు అందించనుంది.

దేశవ్యాప్తంగా ఉన్నటు వంటి కీలకమైన ట్రకింగ్‌ కేంద్రాల వద్ద దీనిని నిర్వహించారు. ఈ ప్రచారంలో వాణి జ్య వాహన విభాగంలోని సుప్రసిద్ధ బ్రాండ్లు అయినటువంటి అశోక్‌ లేలాండ్‌ ట్రకింగ్‌ భాగస్వామిగా, డీలక్స్‌ బేరింగ్స్‌ దీనికి బేరింగ్‌ భాగస్వామిగా, జమ్నా ఆటో ఇండస్ట్రీస్‌ సంస్థ సస్పెన్షన్‌ భాగస్వామిగా మరియు ఎక్స్‌లైట్‌, డీహెచ్‌ లైటెనింగ్‌ ఇండియా సంస్థ లైటింగ్‌ భాగస్వామిగా పాల్గొన్నాయి.
 
ఈ గో ఎక్స్‌‌ట్రా ప్రచారంలో భాగంగా, 14 చక్రాల హెవీ డ్యూటీ అశోక్‌ లేలాండ్‌ ‘ఏవీటీఆర్‌’ ట్రక్‌కు బ్రిడ్జ్‌స్టోన్‌ యొక్క నూతన ఎం 721 టైర్లను డ్రైవర్‌ యాక్సెల్‌ వద్ద అమర్చారు. ఇది తన ప్రయాణాన్ని ఢిల్లీలోని సంజయ్‌ గాంధీ ట్రాన్స్‌పోర్ట్‌ నగర్‌లో జనవరి నెలాఖరులో ఆరంభించింది. ఫ్లీట్‌ నిర్వాహకులు, డ్రైవర్లు, మెకానిక్కులతో అత్యంత అనుసంధానిత సమావేశాలను ఢిల్లీలో పలు ప్రాంతాలు మరియు ఉత్తర్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌‌లలో నిర్వహించి, తదుపరి ఈ ట్రక్‌ ఆ తరువాత తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా అత్యంత ముఖ్యమైన ట్రకింగ్‌ కేంద్రాలైనటువంటి హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, నెల్లూరులో నిర్వహించింది. అదే రీతిలో సంబంధిత ప్రాంతాలలో ట్రాన్స్‌పోర్ట్‌ నగరాలలో కూడా అనుసంధానిత సమావేశాలను నిర్వహించింది.
 
ఈ ఆన్‌గ్రౌండ్‌ కార్యక్రమాలకు అన్ని ప్రాంతాలలోనూ అపూర్వమైన స్పందన స్థానికుల నుంచి వచ్చింది. మార్కెట్‌లో ప్రస్తుతం టైర్లు, ట్రక్‌, బేరింగ్స్‌, సస్పెన్షన్స్‌ మరియు లైటింగ్‌కు సంబంధించిన అందుబాటులో ఉన్న అత్యుత్తమ పరిష్కారాలను స్థానికులకు అందించారు. ఉత్పత్తులు, పరిష్కారాలను ప్రదర్శించడంతో పాటుగా పలు ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాలు, ఆటలు సైతం వీక్షకుల కోసం నిర్వహించారు. తద్వారా విజేతలకు బహుమతులనూ అందజేశారు.
 
ఈ ‘గో ఎక్స్‌ట్రా’ ప్రచారాన్ని 50 రోజులకు పైగా నిర్వహించనున్నారు. ఈ ట్రక్‌ ఆరంభం నాటి నుంచి 6500 కిలోమీటర్లు తిరగనుంది. నెల్లూరు తరువాత ఈ ట్రక్‌ తమిళనాడు చేరుకుని అక్కడ చెన్నై, వెల్లూరు, సేలం, నామక్కల్‌, సంకరీలలో  కార్యక్రమాలు నిర్వహించి, అక్కడ నుంచి కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.
 
ట్రాన్స్‌పోర్ట్‌ కేంద్రాల వద్ద ఎంగేజ్‌మెంట్‌ సమావేశాలతో పాటుగా ఈ ట్రక్‌ ఇప్పుడు ఢాబాల వద్ద కూడా ఆగుతూ, ట్రక్‌ డ్రైవర్లతో సంభాషిస్తూనే బ్రిడ్జ్‌స్టోన్‌ యొక్క నూతన టైర్లు, ఇతర ఆఫరింగ్స్‌ గురించి కూడా చెప్పనున్నారు.
 
శ్రీ తుషార్‌ బన్సోడీ, హెడ్‌ మార్కెటింగ్‌- కమర్షియల్‌ బిజినెస్‌, బ్రిడ్జ్‌స్టోన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘సుప్రసిద్ధ వాణిజ్య వాహన మ్యాగజైన్‌ మోటర్‌ఇండియాతో ఈ గో ఎక్స్‌ట్రా ప్రచారం కోసం భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. పూర్తి నూతన వీ–స్టీల్‌ మిక్స్‌ ఎం 721 టైర్‌ను దీని ద్వారా ప్రచారం చేయనున్నాం. ఈ గో ఎక్స్‌ట్రా ట్రక్‌ 30కు పైగా ప్రాంతాలను సందర్శించి  దేశవ్యాప్తంగా 6500కు పైగా కిలోమీటర్లును ప్రయాణించనుంది. తద్వారా మా టైరును అత్యంత కీలకమైన సీవీ పరిశ్రమ వాటాదారులైనటువంటి ఫ్లీట్‌ ఆపరేటర్లు, ట్రక్‌ డ్రైవర్లు మరియు మెకానిక్కులకు తెలుపనుంది.
 
అదేసమయంలో అత్యంత విలువైన సూచనలు, సలహాలు మరియు పరిష్కారాలను సైతం తెలిపి వారి వ్యాపారం మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాణిజ్య వాహన విభాగంలో అతి పెద్ద వాటా పొందిన సాధారణ కార్గో విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని తీర్చిదిద్దిన ఈ నూతన టైర్‌ 15% అదనపు టైరు మైలేజీని అందించడంతో పాటుగా తద్వారా ఫ్లీట్‌ యజమానులకు కాస్ట్‌ ఫర్‌ కిలోమీటర్‌ (సీపీకెఎం) తగ్గిస్తుంది. ఆన్‌గ్రౌండ్‌ కార్యక్రమాలకు లభించిన ఉత్సాహపూరితమైన స్పందన పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎం721కు మేము ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్న వారిని చేరుకోవడంలో ఇది సహాయపడుతుంది.’’ అని అన్నారు.
 
శ్రీ అవిజిత్‌ లాహిరి, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ అండ్‌ హెడ్- గో ఎక్స్‌ట్రా క్యాంపెయిన్‌, మోటర్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ప్రపంచ శ్రేణి బ్రాండ్‌ అయిన బ్రిడ్జ్‌స్టోన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకోవడం పట్ల మోటర్‌ ఇండియా ఆనందంగా ఉంది. ఇది వినూత్నమైన ప్రచారం. దీనిలో హెవీ డ్యూటీ ట్రకింగ్‌ ప్రయాణం ఉంది. ఇది దేశంలో అత్యంత కీలకమైన రవాణా కేంద్రాలకు ప్రయాణించడంతో పాటుగా జ్ఞానం, సూచనలు, అత్యుత్తమ ప్రక్రియలను సైతం పంచుకోవడం ద్వారా ఫ్లీట్‌ యజయానులు నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడంలో సహాయపడుతుంది.
 
గత 65 సంవత్సరాలుగా పరిశ్రమలో మేము ఉన్నాము మరియు వాణిజ్య వాహన విభాగంలో అత్యంత బలీయంగా ఉనికిని చాటుతున్నాం. సీవీ రంగంలో వేలాది జీవితాలపై ప్రభావం చూపే ఓ ప్రతిష్టాత్మక ప్రచారం కోసం ఆసక్తిగా చూస్తున్నాము. ఇది సీవీ వ్యాపారాన్ని తరువాత దశకు తీసుకువెళ్ళనుంది. మా టైటిల్‌ భాగస్వామి బ్రిడ్జ్‌స్టోన్‌, ట్రకింగ్‌ భాగస్వామి అశోక్‌లేలాండ్‌, బేరింగ్‌ భాగస్వామి డీలక్స్‌ బేరింగ్‌, సస్పెన్షన్‌ భాగస్వామి జమ్నా ఆటో ఇండస్ట్రీస్‌ మరియు లైటింగ్‌ భాగస్వామి ఎక్స్‌లైట్‌,డీహెచ్‌ లైటింగ్‌ ఇండియాకు ధన్యవాదములు తెలుపుతున్నాం,’’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు