రిషి శేఖర్ శుక్లా 100 పర్సంటైల్ సాధించాడు: ఆకాష్ బైజుస్ జాతీయ టాప్ స్కోరర్

ఐవీఆర్

మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (19:58 IST)
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఈఈ) మెయిన్ 2024 మొదటి సెషన్‌లో 100 పర్సంటైల్‌ను హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి రిషి శేఖర్ శుక్లా సాధించినట్లు ఆకాష్‌ బైజూస్‌ సగర్వంగా వెల్లడించింది. అతను సాధించిన ఈ విజయం అతన్ని జాతీయంగా, తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్‌ పరంగా అత్యధిక స్కోరర్‌గా నిలబెట్టడమే కాకుండా భారతదేశంలోని అత్యంత కఠినమైన పోటీ పరీక్షలలో ఒకటైన జెఈఈలో టాప్ స్కోరర్‌గా నిలవటంలో అతని తిరుగులేని నిబద్ధత, విద్యా నైపుణ్యాన్ని కూడా నొక్కి చెబుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సంవత్సరం ఇంజినీరింగ్ కోసం షెడ్యూల్ చేయబడిన రెండు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లలో మొదటి దాని ఫలితాలు ఈరోజు వెల్లడించింది.
 
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సవాలుతో కూడిన ప్రవేశ పరీక్షగా పేరుగాంచిన, ఐఐటి జెఈఈని జయించాలనే ఆకాంక్షతో ఆకాష్‌ బైజూస్‌ క్లాస్‌రూమ్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న రిషి శేఖర్ శుక్లా ఫండమెంటల్ కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడంలో, క్రమశిక్షణతో కూడిన అధ్యయన నియమావళిని కొనసాగించడంలో అంకితభావంతో టాప్ పర్సంటైల్స్‌కు చేరుకున్నట్లు పేర్కొన్నాడు. ఆకాష్ బైజూస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, "అన్ని విధాలా తనకు సహాయ పడినందుకు ఆకాష్‌కు ధన్యవాదములు తెలుపుతున్నట్లు తెలిపాడు. ఇన్స్టిట్యూట్ యొక్క సమగ్ర కంటెంట్, కోచింగ్ లేకుండా, తక్కువ వ్యవధిలో అనేక సబ్జెక్టుల కాన్సెప్ట్‌లపై పట్టు సాధించడం అసంభవం" అని  అన్నాడు.
 
రిషి శేఖర్ శుక్లాను అభినందించిన ఆకాష్ బైజూస్ రీజనల్ డైరెక్టర్ ధీరజ్ మిశ్రా మాట్లాడుతూ, రిషి శేఖర్ శుక్లా యొక్క ఆదర్శప్రాయమైన విజయం, విద్యార్థులకు సమగ్ర కోచింగ్, వినూత్న అభ్యాస పరిష్కారాలతో సాధికారత కల్పించేందుకు, తద్వారా పోటీ పరీక్షల్లో రాణించేలా చేయడంలో ఆకాష్  బైజూస్‌ నిబద్ధతను ఉదాహరిస్తున్నదన్నారు. “తదుపరి ప్రయత్నంతో పాటు అతని భవిష్యత్ ప్రయత్నాలలో మరిన్ని విజయాలను సాధించాలని మేము అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము” అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు