వచ్చే ఆదివారం నుంచి దేశీయ విమాన సర్వీసులు

సోమవారం, 11 మే 2020 (20:21 IST)
కరోనా లాక్డౌన్‌‌ను కేంద్రం దశలవారీగా ఎత్తివేస్తోంది. ఇప్పటికే అనేక అంశాల్లో సడలింపులు ఇచ్చిన కేంద్రం.. మంగళవారం నుంచి ప్రత్యేక రైలు సర్వీసులు అనుమతినిచ్చింది. అలాగే ఆదివారం నుంచి విమాన సర్వీసులను నడిపేందుకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ యోచిస్తోంది. 
 
ఈ మేరకు సోమవారం ఉదయం పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయంతోపాటు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ అధికారులు పలు నగరాల్లోని విమానాశ్రయాలను తనిఖీచేశారు. వాణిజ్యపరంగా విమానాలు నడిపేందుకు ఉన్న అవకాశాలను ఈ బృందం పరిశీలించినట్లు తెలుస్తున్నది. 
 
తొలి విడతలో భాగంగా తక్కువ దూరం ఉన్న ప్రాంతాలకు విమానాలు నడిపితే బాగుంటుందన్న సూచనలు కూడా అందాయి. రెండు గంటల వ్యవధి గల ప్రయాణాలకు ఎలాంటి భోజన సదుపాయం కల్పించకుండా విమానాలు నడుపవచ్చునని యోచిస్తున్నట్టు సమాచారం. 
 
అయితే, విమాన ప్రయాణికులు మాత్రం ఆరోగ్యసేతు యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకొంటేనే ప్రయాణానికి అనుమతించాలన్న మరో సూచన కూడా అందినట్లు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే తొలుత ఐటీ సెక్టార్‌ నగరాలు అయిన ముంబై, హైదరాబాద్‌, బెంగళూరుకు విమానసర్వీసులు నడపేలా చర్యలు తీసుకోనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు