లెవీస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా అలియా భట్

ఐవీఆర్

శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (20:06 IST)
లెవీస్ బ్రాండ్ తన నూతన ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా అలియా భట్‌ను స్వాగతించడం పట్ల గర్వపడుతోంది. ఈ భాగస్వామ్యం రెండు ప్రపంచ శక్తులను ఒకచోట చేర్చింది, అవి డెనిమ్‌ను పేర్కొనే పేరు అయిన లెవీస్, డెనిమ్ యొక్క ప్రపంచ కథనంలో తదుపరి అధ్యాయాన్ని రూపొందించడానికి గాను ప్రపంచవ్యాప్తంగా సినిమా, ఫ్యాషన్‌లో ప్రభావం చూపిన అలియా భట్.
 
మహిళల ఫ్యాషన్ అతిపెద్ద మార్పును స్వీకరిస్తున్న సమయంలోనే ఈమె ఈ బ్రాండ్‌ యందు చేరారు. ఊరట కలిగించే ఫిట్స్, వెడల్పాటి కాళ్ళు, వదులుగా ఉండే సిల్హౌట్‌లు ఇక మీదట కేవలం కాలానుగతమైన పోకడలు కాబోవు, అవి ప్రతిరోజూ ఆవశ్యకమైనవిగా మారుతున్నాయి. డెనిమ్ అంటే ఏమిటో పేర్కొనడంలో సుదీర్ఘ కాలంగా ప్రసిద్ధి చెందిన లెవీస్ ఐతే ఈ పరిణామంలో ముందు భాగంలో ఉంది. ఇక ఆలియా నాయకత్వంలో, ఆ మార్పు ప్రధాన జీవనస్రవంతి లోనికి వెళ్ళబోతోంది.
 
ఆలియా ఇలా అన్నారు, నాకైతే జీన్స్ అనేది ఎప్పుడూ కేవలం జీన్స్ మాత్రమే కాదు - అది మీరు జీవించేది, మీ స్వంతం చేసుకునేది. మా డెనిమ్‌లతో మా సంబంధబాంధవ్యం ఎంతో వ్యక్తిగతమైనది, అయితే ఒక విధంగా, అది మనందరినీ కలుపుతుంది కూడా. అనేక దేశాల వ్యాప్తంగా, తరాల వ్యాప్తంగా, డెనిమ్ అంటే మీరు ఎవరో నిజంగా సంబరంగా జరుపుకోవడం అన్నమాట. ఈ ప్రపంచ ఉద్యమంలో లెవిస్ ఎల్లప్పుడూ కేంద్ర బిందువుగా ఉంటుంది మరియు ఇప్పుడు వారి బ్రాండ్ అంబాసిడర్‌గా అందులో భాగమైనందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అన్నారు.
 
లెవీస్, అలియా ఒక ఉమ్మడి దార్శనికతతో ఐక్యమై ఉన్నారు - కొత్త తరం ఎలా వస్త్రధారణ చేసుకోవాలనుకుంటుందో ప్రతిబింబించడానికి, క్లాసిక్ ఫిట్‌లకు అతీతంగా బ్రాండును స్టైల్-ఫస్ట్, ట్రెండ్-ఫార్వర్డ్ ఔచిత్యానికి అనుగుణంగా అభివృద్ధి చేయడానికి. అది లూజ్ ఫిట్స్ అయినా గానీ, వైడ్ లెగ్ అయినా గానీ, లేదా తిరిగి కనుక్కోబడిన క్లాసిక్స్ అయినా గానీ, లెవీస్ యొక్క మహిళల పోర్ట్‌ఫోలియో అభివృద్ధి చెందుతోంది, ఈ తర్వాతి అధ్యాయానికి అలియా సరైన ఉత్ప్రేరకంగా ఉంది.
 
ఆలియా భట్ ప్రభావం సినిమా, ఫ్యాషన్‌ను మించిపోయింది, ఆమె సంభాషణలను రూపొందిస్తారు అని లెవి స్ట్రాస్-కో, దక్షిణాసియా-మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ హిరెన్ గోర్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు