తెలుగు సినిమాలో టైమ్ పంక్చూవాలిటి చాలా ఇష్టం. ఇక్కడ ఆర్టిస్టుల ప్రొఫెషనలిజం కూడా చాలా ఇష్టం. ప్రతి ఆర్టిస్టును సమానంగా చూడటం నాకు చాలా నచ్చింది. తెలుగు సినిమా గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉంది అని ముంబై నటి ఆరతి గుప్తా అంటోంది.
సంపూర్ణేష్ బాబు, సంజోష్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం 'సోదరా'. అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్నచిత్రానికి మన్ మోహన్ మేనం పల్లి దర్శకుడు. క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆరతి గుప్తా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా మంగళవారం ఆరతి గుప్తా పలు విషయాలు తెలిపారు.
- చంఢీగడ్ పుట్టి పెరిగిన నేను ముంబయ్‌లో స్థిరపడ్డాను. ఇంతకు ముందు బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించాను. కానీ తెలుగులో నా తొలచిత్రం 'సోదరా'
- కథ నచ్చి ఒప్పుకున్నాను. బ్యూటీ ఆఫ్ దస్క్రిప్ట్. లైట్ హార్టెడ్ ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ సినిమా మీ స్నేహితులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరితోనైనా చూడొచ్చు. ఈ సినిమాలో నా పాత్ర కూడా బాగా నచ్చింది. అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. సింపుల్ విలేజ్ గర్ల్. చదువున్న అమ్మాయి. ఇన్నోసెంట్, అండ్ డిగ్నిఫైడ్. పాత్ర అది.
- ఈ చిత్రం ట్రైలర్ లాంచ్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకుని తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంది. ఇక్కడ స్థిరపడాలంటే తెలుగు నేర్చుకోవాలి. అప్పుడే నాకు కంఫర్ట్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లో ఎదో తెలియని ఎనర్జీ ఉంది. కామ్‌గా ఉంది. వెరీ మచ్ హోప్ ఫుల్ ఇక్కడ నేను బిజీ అవుతుందని నమ్మకం ఉంది.
- ఇంతకు ముందు ట్రెడిషినల్ పాత్రలు చేశాను. రియల్‌లైఫ్‌లో కూడా నేను సింపుల్ గర్ల్ నా వ్యక్తిత్వం అలానే ఉంటుంది. నా వ్యక్తిత్వానికి దగ్గర ఉండే పాత్రను ఈ సినిమాలోచేశాను.
- అన్ని తరహా పాత్రలు, అన్నీ తరహా సినిమాలు చేయాలని వుంది. అవసరమైతే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేయాలని ఉంది. బాగా యాక్ట్ చేయగలిగితే మనం అందంగా కనిపిస్తాం. ఒకవేళ అందంగా ఉండి యాక్ట్ చేయలేకపోయినా గ్లామర్‌గా కనిపించం. పర్‌ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలకే నా మొదటి ప్రాధాన్యత.
- అలియాభట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె జర్నీ, ఆమె చేసిన పాత్రలు నాలో ప్రేరణను నింపాయి. ఆమె సినిమాల సెలక్షన్ కూడా బాగుంటుంది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ గారంటే చాలా ఇష్టం, ఆయన సినిమాలు చాలా ఇష్టం.