50వ గ్లోబల్ స్కేల్ రేటింగ్‌ను ప్రచురించిన కేర్‌ఎడ్జ్ గ్లోబల్

ఐవీఆర్

గురువారం, 14 ఆగస్టు 2025 (22:39 IST)
కేర్ రేటింగ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన కేర్ఎడ్జ్ గ్లోబల్ ఐఎఫ్ఎస్సీ లిమిటెడ్ (కేర్ఎడ్జ్ గ్లోబల్) తన కార్యకలాపాల మొదటి ఏడాదిలోనే 50వ ప్రపంచ స్థాయి పబ్లిక్ రేటింగ్‌ను ప్రచురించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ విజయం కేర్ఎడ్జ్ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్‌ల  విభిన్నమైన, భవిష్యత్తును చూసే విధానంపై పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
 
అక్టోబర్ 2024లో ఐఎఫ్ఎస్సీ గిఫ్ట్ సిటీ నుండి ప్రారంభించబడిన కేర్‌ఎడ్జ్ గ్లోబల్ సంస్థ సావరిన్, గ్లోబల్ రేటింగ్స్ రంగానికి కొత్త దృక్పథాన్ని పరిచయం చేసింది. దీని సావరిన్ రేటింగ్ కవరేజ్‌లో వివిధ ఖండాలలో ప్రపంచ జీడీపీలో 85 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 39 దేశాలు ఉన్నాయి. ఇది సంస్థ విశ్లేషణాత్మక విధాన వైవిధ్యం, లోతును ప్రదర్శిస్తుంది. బహుళపక్షసంస్థలు, కేంద్ర బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, మార్కెట్ భాగస్వాములతో విస్తృతమైన సంప్రదింపుల ద్వారా అభివృద్ధి చేయబడిన కేర్‌ఎడ్జ్ గ్లోబల్  ప్రొప్రైటరీ మెథడాలజీ బిగ్ త్రీ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు కేటాయించిన రేటింగ్‌ల నుండి 50 శాతం కంటే ఎక్కువ వ్యత్యాసాన్ని కలిగి ఉంది.
 
సావరిన్ రేటింగ్‌లతో పాటు కార్పొరేట్ రేటింగ్‌లలో కేర్‌ఎడ్జ్ గ్లోబల్ గణనీయమైన పురోగతిని సాధించింది. పునరుత్పాదక ఇంధన వనరులు, విమానాశ్రయాలు, విద్యుత్ సంస్థలు, బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనా న్షియల్ కంపెనీలు, మౌలిక సదుపాయాల ఫైనాన్సర్‌లతో సహా విస్తృత శ్రేణి రంగాలలో 11 పబ్లిక్ రేటింగ్‌లను ప్రచురించింది. అదనంగా, ఇది వివిధ ఇష్యూయర్స్, డెట్ ఇష్యూయన్స్‌లకు ప్రైవేట్ రేటింగ్‌లను కూడా కేటాయించింది. మొత్తం రేటింగ్ పొందిన రుణ పరిమాణం USD 4 బిలియన్లను మించిపోయింది. ఈ వైవిధ్యమైన కవరేజ్ రంగాలు, భౌగోళిక ప్రాంతాలలో రేటింగ్ అసైన్‌మెంట్‌లను అమలు చేయడానికి కేర్‌ఎడ్జ్ గ్లోబల్ సంసిద్ధత, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.
 
కేర్‌ఎడ్జ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ మెహుల్ పాండ్యా ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేర్‌ఎడ్జ్ గ్లోబల్ అనేది కేర్‌ఎడ్జ్ గ్రూప్ వ్యూహాత్మక వెంచర్. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరం లోనే సాధించిన గణనీయమైన పురోగతి పట్ల మేము సంతోషిస్తున్నాం. ఈ మైలురాయి ప్రపంచ మూలధన మార్కెట్ భాగస్వాములను శక్తివంతం చేయడంలో, ఎంపిక చేసుకునే ప్రపంచ రేటింగ్ ఏజెన్సీగా మమ్మల్ని మేం నిలబెట్టుకోవడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ గిఫ్ట్ నగరాన్ని ఆర్థిక సేవలకు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయ డంలో కీలక పాత్ర పోషించింది. IFSCA ద్వారా అధీకృత మొదటి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీగా కేర్‌ఎడ్జ్ గ్లోబల్ ప్రపంచ స్థాయిలో సమగ్ర రేటింగ్‌లను అందించడానికి ప్రత్యేక స్థానం పొందింది అని అన్నారు.
 
ఈ సందర్భంగా కేర్‌ఎడ్జ్ గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రేవతి కస్తూరే మాట్లాడుతూ, 2024 అక్టోబర్‌లో మా గ్లోబల్ స్కేల్ రేటింగ్‌లను ప్రారంభించినప్పటి నుండి మా ఔట్రీచ్, రేటింగ్ కవరేజ్, సేవల విస్తరణలో మేం అద్భుతమైన పురోగతిని సాధించాము. మదుపరులు, ఇష్యూయర్స్, విధాన రూపకర్తల నుండి స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. మొదటి మైలురాళ్ళు ఎల్లప్పుడూ ప్రత్యేకమైనవి, అలాగే మా మొదటి 50 పబ్లిక్ రేటింగ్‌లు కూడా అంతే ప్రత్యేకమైనవి. దృష్టి కేంద్రీకరించిన ప్రయత్నాలు, రేటింగ్ నాణ్యత, విభిన్న విశ్లేషణా త్మక విధానం ద్వారా మా పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి మేం కట్టుబడి ఉన్నాం అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు